Sekhar Reddy Sudha
1.2K views
5 days ago
ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానాచందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు, చీమలు చేరాయి. అపుడు సాయి నానాతో, నేను ఆరగించాను. నీవు తీసుకో! అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నం గూడ తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా,18 సం॥లు నా దగ్గరుండి నీవు గ్రహించినదిదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో! అన్నారు.వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు ఋజువేమిటి?" అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే వున్నారని నానాకు అర్ధమై ప్రసాదం తీసుకున్నాడు. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా