P. Chandra Shekar
550 views
11 hours ago
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 "#అం” మాతృక నిగూఢార్థం పురుషుడు - విష్ణువు / శివుడు. స్థితికి మూల కారణం పురుషుడే. మాతృకా పీఠము లేక నివాసస్థానం “కామరూప”, అధిదేవత "అమృత" లేక "అజముఖి”. ఆమెక్రియా శక్తి. ఈ "#అం” బీజాన్ని సాధకుడు ఉచ్చరించినపుడు ఈ క్రియా శక్తి జాగృతమై సాధకుని నాభిస్థానాన్ని చేరుతుంది. ఆ నాభిస్థానం శుద్ధ క్రియాశక్తికి మూలస్థానం (నివాసస్థానం) అధోముఖంగా ఉన్న పసుపురంగు త్రిభుజం, ఊర్ధ్వముఖంగా ఉన్న మరొక పసుపు రంగు త్రిభుజాలు, సాధకుని ఉచ్చారణ, ఆవాహనలను సూచించగా, కాషాయ వర్ణపు అధోముఖ త్రికోణం, అస్తిత్వమునూ ఎరుకనూ శుద్ధ చైతన్యాన్నీ సూచిస్తాయి. ఈ శుద్ధచైతన్యం ఆకుపచ్చని లింగరూపం సూచిస్తుంది. ఇవన్నీ ఒక షడ్భుజ (షట్కోణ) యంత్రంలో అంతర్భాగాలుగా ఉన్నాయని గమనించవచ్చు. నీలి వర్ణపు రేఖలతో గీసిన త్రికోణం ఎరుకను (జ్ఞానాన్ని) సూచిస్తుంది. అహం తదస్మి. కాషాయ వర్ణపు ఊర్ధ్వముఖ త్రికోణం విశ్వసృష్టి స్థితిని అస్తిత్వంగా సూచించడం జరుగుతుంది. ఈ #మాతృక లో మొత్తం 33 ప్రకంపనలు (స్పందనలు) ఉంటాయి. ఈ ప్రకంపనలు ప్రకృతి పురుషులు, శివశక్తుల, చైతన్యం, ఎరుక లేక జ్ఞానముల సంయోగానికి సంకేతాలు. ఈ "అం" మాతృకా సాధకుడు తనలో శివత్వ శక్తిత్వాల సంయోగ అనుభూతిని పొందుతాడు.