TV9 Telugu
815 views
8 hours ago
T20 World Cup 2026 : బంగ్లాదేశ్ తప్పుకుంది..పాకిస్థాన్ కూడా బ్యాగ్ సర్దేస్తోందా? వరల్డ్ కప్ లో అసలేం జరుగుతోంది?
T20 World Cup 2026 :పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజం సేథీ మరోసారి తన నోటికి పని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ మండలిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో పెను దుమారం రేపుతున్నాయి.ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, అది ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఐసీసీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బీసీసీఐ హస్తం ఉంటుందని ఆయన విషం చిమ్మారు.