*యిర్మియా 33:6 లో దేవుడు చెప్పిన మాట ఒక సాధారణ వాగ్ధానం కాదు, “నేను ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను” అని దేవుడు మనుష్యుని మొత్తం జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. శరీరం నొప్పితో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనసు అలసిపోయినప్పుడు, ఆత్మ నిరాశలో మునిగినప్పుడు దేవుడు స్వస్థతను ప్రకటిస్తున్నాడు.* మన శారీరక బలహీనతలు దేవునికి తెలుసు. రోగం, నొప్పి, అలసటతో ఉన్నవారికి ఆయన “నేనే నీ స్వస్థత” అని ధైర్యం ఇస్తున్నాడు. అదే విధంగా మనసులో దాగిన భయాలు, గాయాలు, నిరాశలను కూడా దేవుడు నయం చేస్తాడు. మనం మానసికంగా కూలిపోతున్న వేళ, దేవుడు మనస్సుకు శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తాడు.
అన్నిటికన్నా ముఖ్యంగా మనం పాపం, అపరాధ భావనతో దేవుని నుండి దూరమైనప్పుడు దేవుడు ఆత్మను స్వస్థపరుస్తాడు, తిరిగి జీవింపజేస్తాడు. మన ఆశను వెలిగించి, కొత్త ఆరంభాన్ని ఇస్తాడు.
దేవుడిచ్చే స్వస్థత నుంచే ధైర్యం పుడుతుంది. పరిస్థితులు మారకపోయినా, భయానికి చోటు లేకుండా, విశ్వాసం పుడుతుంది. ఆయన వాగ్ధానం నెరవేరే వరకు మన జీవితం ఆశతో కొనసాగించబడుతుంది. ఆమెన్
http://youtube.com/post/Ugkxf9DgWX8_pgrVji9B98NHDdivzPMl9WMD?si=BTndWPLz5da7TCXf
#💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్