#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳 #📖భారత రాజ్యాంగం⚖️
#రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు.. జనవరి 26తో లింక్ ఏంటి.. చరిత్ర ఎం చెప్తుందంటే ?
భారతదేశ గణతంత్ర దినోత్సవం జనవరి 26, దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఏడాది 2025లో భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజును దేశ రాజ్యాంగం అమలుకు ప్రతీకగా ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్, జెండా ఎగురవేత ఇంకా వివిధ రాష్ట్రాలలో వేడుకలు ఉంటాయి. ఇదే రోజున ఎర్రకోట పై దేశ ప్రధాని మొదట జండా ఎగరేస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు.
భారతదేశం 15 ఆగష్టు 1947న స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశంలో దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన రోజు కూడా ఇదే. అయితే 26 జనవరి 1950 వరకు భారతదేశానికి రాజ్యాంగం లేదు. స్వతంత్రం పొందిన తరువాత 29 ఆగష్టు 1947న ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగం అధికారిక ముసాయిదా 4 నవంబర్ 1947న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. తరువాత రెండు సంవత్సరాలలో దానిలో వివిధ మార్పులను చేర్చి చివరకు 24 జనవరి 1950న అసెంబ్లీ ఆమోదించింది.
భారత రాజ్యాంగం లిఖించడం 26 నవంబర్ 1949న మొదలు పెట్టారు, అయితే రాజ్యాంగంని అమలు చేయడానికి జనవరి 26 ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ వెనుక కథ ఏంటి తెలుసా... 26 జనవరి 1930న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణా స్వరాజ్‌ని ప్రకటించింది. ఈ రోజును దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశ రాజ్యాంగాన్ని రూపొందించే పని కూడా ప్రారంభించింది. ఈ రాజ్యాంగంని 26 నవంబర్ 1949న ఆమోదించారు అలాగే 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. జనవరి 26న రాజ్యాంగాన్ని ప్రకటించడం ద్వారా భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది పోరాటాన్ని పూర్తి చేసి కొత్త శకానికి నాంది పలికింది.
ఈ రోజును ఎంచుకోవడం ద్వారా దేశం 1930 నాటి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని కూడా గుర్తు చేస్తుంది. రిపబ్లిక్ డే ప్రాముఖ్యత రిపబ్లిక్ డే నాడు భారతదేశ ప్రజాస్వామ్య విలువలను జరుపుకుంటుంది. మనమందరం సమానమని, దేశ పాలనలో భాగస్వామ్యమని ఈ రోజు గుర్తుచేస్తుంది. దేశంలోని వివిధ కులాలు, మతాలు, సంస్కృతులు ఏకం కావడం ఈ రోజు గుర్తు చేస్తుంది. ఇంకా రిపబ్లిక్ డే మన రాజ్యాంగం ప్రాముఖ్యతను గుర్తు చేస్తు ఇంకా మన హక్కులు, విధులను తెలియజేస్తుంది.
🇮🇳🇮🇳🇮🇳 భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🙏🙏