👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
681 views
24 days ago
కొత్త సంవత్సరాలు వస్తువుంటాయ్, పోతుంటాయ్.. కానీ పోయిన ప్రాణాలు తిరిగిరావు.. నూతన సంవత్సర ఉత్సహ వేడుకల్లో అతిగా మద్య సేవనం వల్ల జరిగే నష్టంలో ప్రతి సంవత్సరం సొంతవారి దుఃఖానికి, కన్నవారి గుండెకోతకు, కట్టుకున్న వారి కన్నీళ్లకు, కుమిలిపోయే తోబుట్టువుల వేదనకు కారణం అవ్వకండి.. తాగిన మైకంలో ఉన్నపుడు మనకోసం ఇంట్లో తల్లిదండ్రులు, పెళ్ళాం పిల్లలు ఎదురుచూస్తున్న విషయం జ్ఞాపకంలో ఉంచుకుని డ్రైవింగ్ చేసి, సేఫ్ గా ఇల్లు చేరండి.. రేపు ఒక్కరోజు క్యాలెండర్ లో సంఖ్య మారుతుంది అంతే.. మనదికాని సంస్కృతి అయిన సరే పాటిస్తున్నాం. కానీ దయచేసి ఈ రోజు కుటుంబ సభ్యులతో సాయంత్రం నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి మనం కరెక్టుగా ఉన్నా నేటి రాత్రి ప్రభావం చాలా ప్రమాద కరంగా ఉంటుంది. కావున మీ పిల్లల సంరక్షణ పట్ల కూడా జాగ్రత్త వహించండి. చాలామంది ఆత్మీయ స్నేహితులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల మనోవేదన చూసిన అనుభవం ఇప్పటికీ కళ్ళముందు మెదులుతోంది. దయచేసి జాగ్రత్తలు వహించండి..🙏 #💗నా మనస్సు లోని మాట #it's a request #take care 👍