👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
545 views
13 hours ago
చదువులతల్లి అవతరించిన పరమపావన పర్వదినం విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీ దేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమి చదువులతల్లి జన్మదినం. సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్ధ వించిన తిథి. 'యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా" అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా గల పురాణాలు ఆ అమ్మను అర్పించాలని సూచిస్తున్నాయి. మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః ॥ మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్పించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈరోజు మహా గణపతిని, శ్రీలక్ష్మిని కూడా షోడశోపచారాలతో పూజించాలనీ, సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్పించాలి. "క్లోణి తలంబునన్ సుదురు సోకక మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర శ్రేణికి దోయజాతభవచిత వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్" నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే మాతకు, బ్రహ్మదేవుని మనస్సు వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి సరస్వతికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను. ఈ సమస్త విశ్వం శబ్దమయం. నాదంతోనే జగత్ సృష్టి ప్రారంభమైంది. నాద శక్తికి ప్రతిరూపంగా సరస్వతీమాత బ్రహ్మవిద్యా స్వరూపిణియై శోభిస్తుంటుంది. విద్యకు అధిష్ఠాత్రి సరస్వతీదేవి ఆ తల్లి మాఘ శుద్ధ పంచమి నాడు ఆవిర్భవించిం దని శాస్త్ర వాక్కు. శ్రీపంచమి నాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవీ భాగవతం, బ్రహ్మవైపర్తపురాణాలు పేర్కొం టున్నాయి. శ్రీపంచమి నాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహరూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయని, జ్ఞాపక శక్తి మేధ, బుద్ధి వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఆ రోజున జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట. సర్వజీవులలో చైతన్య స్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూ పిణి సరస్వతి. 'శ్రీమాతా' అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేశ్వరుని వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి. సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి. "మాఘస్య శుక్ల పంచమ్యాం... మానవోమనవో దేవామునీంద్రాశ్చ ముముక్షవః వసవోయోగినస్పిజ్ఞానాగా గంధర్వ రాక్షసా! మద్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి భక్తియుక్తిశ్చ దత్త్వావై చోపచారాణి షోడశ" మాఘ శుద్ధ పంచమి నాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారని దేవీభాగవతం చెబుతోంది. మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సూర్యుడు. "సర్వ చైతన్య రూపాంతాం ఆద్యా విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్" అని ప్రార్ధించాడు. ఏ విద్యను అనుగ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు. "చత్వారి వాక్పరిమితా పదాని తానీ విదుర్భాహ్మణాయే మనీషిణిః గుహత్రీణి నిహితా నేజ్జయంతి తురీయం వాచో మనుష్యా వదంతి" అని సరస్వతీ సూక్తంలో వాక్ స్వరూపం గురించి చెప్పబడింది. వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది. 1. పరా 2. పశ్యంతి 3. మధ్యమా 4. వైఖరీ. మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపజేసేదే 'పరా'. మాట పలికే ముందు 'పర' ద్వారా ప్రేరేపితమై భావాత్మకంగా గోచరించేదే 'పశ్యంతీ'. ఆ భావం మాటలుగా మార్చుకున్న స్థితి 'మధ్యమా', ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే 'వైఖరీ'! యోగ శాస్త్ర పరంగా వీటి ప్రయాణం గురించి చెప్పాలంటే మూలాధారం నుంచి నాభి, హృత్, కంఠ, నాలుకలు వీటన్నింటికీ మూలమైన నాదం కూడా సరస్వతీ రూపమే. ఇక భావ ప్రకటన కోసం చెట్లు 'పరా' వాక్కుని, పక్షులు పశ్యంతీ వాక్కును, జంతువులు ''మధ్యమా' వాక్కును, మనుష్యులు 'వైఖరీ' వాక్కును ఉపయోగిస్తున్నారు. ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక 'శారద' అని అన్నారు. అందుకే పోతనామాత్యుడు- "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం వాల్మీకిని కవిని చేసిన మంత్రం నిరంతరం జపించవలసిన ఒకానొక సరస్వతీ మూల మంత్రాన్ని వేదాలు మనకందించాయి. ఆ మూలమంత్రం ఇది- "ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా" ఈ సరస్వతి మంత్రాన్ని పంచమినాడు కాని, లేదా అక్షరాభ్యాస సమయంలో కాని, లేదా ఏదైనా పవిత్రమైన తిథినాడు కాని గురువు ద్వారా ఉపదేశం పొంది జపిస్తే విద్యా జ్ఞాన సంపద లభిస్తుంది. ఈ మంత్రం కల్పవృక్షం వంటిదని దేవీ భాగవతం చెపుతోంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఈ మంత్రాన్ని వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. దీనిని జపించి, ఆ ప్రభావంతో వాల్మీకి కవి అయ్యాడు. దార సుధావయోధిసిత తామర సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిగాన నెన్నడు గల్గు భారతీ". అని ప్రార్ధించాడు. సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి, అర్పించాలని కోరుకున్నారు పోతన, తెల్లని పద్మం పై కూర్చుని, ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా ముడుచుకుని కూర్చున్నట్లు, లేక నిలబడి, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తల్లి తెల్లని గంధం పూతతో దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని కూచిమంచి తిమ్మకవి ఈ క్రింది విధంగా స్తుతించాడు. "బలుతెలివులు మరువము, బంగరు వీణీయ మిస్కుటం వెయిన్ జిలుక తుటారి బోటియును, జిందపు వన్నియమేను బొత్తమున్ జెలువపు వెల్లదమ్మి విరిసింగపు గజ్జెయు గల్గి యొప్పున ప్పలుకుల చాస, జాసలరు పల్కు లొసంగెడు గాతనిచ్చలున్" "బాగా తెల్లనైన పక్షి హంసనే గుర్రపు వాహనంలా చేసుకున్న తల్లి బంగారు వీణను. మెరిసే అందెలను, చిలుకను, పుస్తకాన్ని ధరించి, శంఖం వంటి తెలుపు మేనితో ప్రకాశిస్తూ, అందమైన తెల్లని పద్మాన్నే ఆసనంగా చేసుకున్న 'వాగ్దేవి' సరస్వతి, చక్కని పలుకులను నాకు నిత్యం అనుగ్రహించుగాక" అని ఆ కవీశ్వ రుడు వేడుకుంటున్నాడు. అందుకే ఆ తల్లిని ప్రతి శ్రీపంచమి నాడు భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. శ్రీపంచమి నాడు విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల, చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు. #శ్రీ పంచమి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత #శ్రీ పంచమి శుభాకాంక్షలు.