మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి. భక్తి భావంతో నావైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధల ననుసరించి, రాత్రింబవళ్లు మీ వద్దనే ఉంటాను.
నా ఈ శరీరం ఇక్కడున్నా? మీరు సప్త సముద్రాలకవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి. నేను మీ వెంటే ఉంటాను.
మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి.
సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లోగాని, వాకిట్లోగానికి లేదా దారిలో కానీ అయాస్థలాలలో ఎవరు మీకు కలిసినా, నేనే వారిలో తిష్టవేసుకుని ఉన్నాను.
చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, శ్వాన సూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ సర్వత్రా నేను నిరంతరంగా నిండి ఉన్నాను.
నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు
#🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా