#🙏 ఓం నమో నారాయణ నారాయణ
🙏నీ నామముకన్న మిన్నేదిలేదూ
నీలశరీర హే మాధవా!
నీ దయ లేనిదే మేము లేమూ !
శ్యామ సుందర హే కేశవా //నీనామ//
1)శంక చక్రా భుజకిరిటిధారీ!
గరుడ వాహన విశ్వాంభరా!
కమల నయనా లక్ష్మీ రమణా!
భక్తవత్సల హేగోవిందా //నీనామము//
2)మదుర మనోహర మురళి గ్రోళా!
మఖుఠ మయూరీ పించ శ్రీ హరీ!
అభయం బొసగే ఆదినారాయణా!
కరుణలవాలా కావర హేరీ//నీనామ//
3)నినువర్ణించుటా నాతరమౌనా!
నిఖిల లోకాల పరిపాలకా!
అలకేల నాపైన ఆదరించరా!
రక్షణ జేయర నరహరి ఒకసారి//నీనామ//
!! రామకృష్ణ గోవింద నారాయణా!!
!! నారాయణా హరి నారాయణా!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
రచన తాటికొండ రాజేశ్వర్ పద్మశాలి
మండలం భోథ్ జిల్లా అదిలాబాద్