Sanju Samson : బాబోయ్ సంజూ క్రేజ్ మామూలుగా లేదుగా..బోణీ కొట్టకపోయినా జట్టులో చోటు పక్కా అట
Sanju Samson : న్యూజిలాండ్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సంజూకు అండగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఒకటి రెండు మ్యాచ్‌ల వైఫల్యాల ఆధారంగా ఒక ఆటగాడిని తీసేయకూడదని, సంజూ లాంటి మ్యాచ్ విన్నర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని రహానే కోరాడు.