హరికృష్ణ ఆచార్య
1.6K views
22 days ago
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #గురువారం గురు ఆరాధన చేయాలి. గురు పరంపర ను కీర్తించాలి. గురువు ను గౌరవించే వారి జీవితాలు సదా సుఖ సంతోషాలతో వెల్లి విరుస్తాయ్. అవతార పురుషులు సైతం మానవ అవతారం ఎత్తినపుడు సాధారణ మానవుల వలె గురువులను కీర్తించారు అంటే గురువు యొక్క వైభవం ఎటువంటిది అన్నది తెలుసుకోవచ్చు. గురువు లేని వారికి ఆ శివుడే గురువు.. గురువులందరికి ఆది గురువు కూడా శివుడే. దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని గురువుగా ధ్యానిద్దాం. గురువుగా శివుని అనుగ్రహం పొందుదాం. శివాయ గురవే నమః ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||