#ఓం నమో వేంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం
#🙏🌹తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి🌹🙏
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰
#ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
తిరుమలలో పులికాపుతీర్ధం అంటే ఏమిటి?...!!
'శ్రీహరి పాదతీర్ధంబే చెడని మందు
మోహపాసాలు గోసి మోక్షమిచ్చే మందు
కారమై కంటగించని కడు చల్లని మందు నూరని కాచనియట్టి నున్నని మందు
కోరికతో వెలవెట్టి కొని తేవల్లని మందు వేరు వెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు
గురుతైన రోగములు గుణముచేసే మందు దురితములు పెడబాపే దోడ్డ మందు
నిరతము బ్రహ్మాదులు నేరుపుతో సేవించే మందు నరకము సొరమట్టి నయమయిన మందు
అని హరిపాద తీర్ధ మహిమ ను గురించి 'అన్నమయ్య' కీర్తించాడు.
కొండలలో వెలసిన కోనేటిరాయుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకార ప్రియుడు.
సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళపాదపద్మారాధన, బుధవారం సహస్రకలశాభిషేకం, గురువారం తిరుప్పావై, శుక్రవారం మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు.
శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు వుండడంతో, అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితో పాటు అమ్మవారికి కూడా కలిపి ఒకేరోజు అభిషేక సేవను నిర్వహిస్తారు.
ఈ శుక్రవారాభిషేకాన్ని భగవద్రామానుజులవారు శ్రీస్వామి వారి వక్షఃస్థలంలో బంగారు అలమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేట్లు ఏర్పాటు చేశారట.
అభిషేక సమయంలో 84తులాల పచ్చకర్పూరం, 36తులాల కుంకుమ పువ్వు, ఒకతులం కస్తూరి, ఒక్కటిన్నర తులం పునుగు తైలం, 24తులాల పసుపుపొడి వంటి పరిమళ ద్రవ్యాలను ఉపయోగిస్తారు.
శ్రీవారి మహాభక్తుడైన తిరుమలనంబి వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని తొలుత జియ్యంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా...
ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ "హరిః ఓం సహస్రశీర్షా పురుషః" అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు.
శ్రీవారికి అభిషేకం చెయ్యగా వచ్చే తీర్ధాన్ని 'పులికాపుతీర్ధం (శ్రీ పాదతీర్ధం)' అంటారు.
ఈ తీర్ధాన్ని అభిషేకంలో పాల్గొనే భక్తులుపై సంప్రోక్షిస్తారు. ఈ తీర్ధాన్ని శ్రీవారి భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు.
అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది.
🙏🏻🌷🙏🏻🌷🙏🏻