Sąíkűmąŕ $@i
1.3K views
6 days ago
*పాక్‌-చైనా మధ్య ఆ ఒప్పందం చట్టవిరుద్ధం* * దిల్లీ: వివాదాస్పద షక్సాగామ్‌ వ్యాలీకి సంబంధించి చైనా చేసిన ఆరోపణలను భారత్‌ తిప్పికొట్టింది. పాకిస్థాన్‌, చైనా మధ్య 1963లో కుదిరిన సరిహద్దు ఒప్పందం చట్ట విరుద్ధమని భారత ఆర్మీ అధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలను భారత్‌ గుర్తించబోదని స్పష్టం చేశారు. 1963లో పాకిస్థాన్‌.. ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. పాక్‌-చైనా ఆర్థిక కారిడార్‌ను గుర్తించేది లేదని, అది చట్ట విరుద్ధమని ఆర్మీ చీఫ్‌ అన్నారు. #news #army #sharechat