సచ్చరిత్ర ద్వారా బాబా గారు ఇచ్చే సందేశములు
మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే.
బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందు గాని నిలబడి , బాబా వెళ్ళి ఒస్తానని చెప్పి వెళ్ళండి.
మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి.
ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి.
మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మనసమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు.
#🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా