P.Venkateswara Rao
650 views
1 days ago
#వైరల్ వీడియోస్ *‘‘వందల వీథి కుక్కల్ని చంపేసే ఊళ్లకు తెలుసు… ఆ సమస్య తీవ్రత…’’‼️* January 23, 2026🎯 భూత దయ, జీవ కారుణ్యం, జంతు ప్రేమ… ఈ పదాలు ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశాలయ్యాయి… ఎందుకు..? వీథి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు తీసుకున్న కఠిన వైఖరి కారణంగా… కుక్క కాట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, చిన్న పిల్లలపై కుక్కల దాడులు, కొన్ని మరణాలు కూడా… దాంతో సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది… షెల్టర్లకు తరలించాలనే తీర్పుపైనా హైఫై సమాజంలో భిన్నాభిప్రాయాలు… ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ ఎపిసోడ్… భూత దయకు పేటెంట్ తీసుకున్నట్టు మాట్లాడే మనేకా గాంధీ సుప్రీం కోర్టు వైఖరి మీద చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం… ఆమె బాడీ లాంగ్వేజ్, భాషల మీద కోర్టు ధిక్కారం పెట్టాలనుకున్నాం కానీ, వదిలేస్తున్నాం అంది కోర్టు… హైదరాబాదులో నటి రేణు దేశాయ్ ప్రెస్ మీట్… ఏదేదో అరిచింది… మగాళ్లు కారా, మీకు మగతనం లేదా… దోమలు కుడితే వ్యాధులు రావడం లేదా వంటి వ్యాఖ్యలూ సందర్భరహితంగా వదిలింది… ఓ సీనియర్ సోషల్ మీడియా యాక్టివిస్టుపై నోరు పారేసుకుంది… ఆమె భాష, ఆమె బాడీ లాంగ్వేజ్… అంతా అయోమయం, గందరగోళం… పెడితే జైలులో పెట్టుకొండి నన్ను అంటోంది.., నా పర్సనల్ లైఫ్ మీద ట్రోలింగ్ సాగుతోంది అంటోంది… ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ ఎపిసోడ్… భూత దయకు పేటెంట్ తీసుకున్నట్టు మాట్లాడే మనేకా గాంధీ సుప్రీం కోర్టు వైఖరి మీద చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం… ఆమె బాడీ లాంగ్వేజ్, భాషల మీద కోర్టు ధిక్కారం పెట్టాలనుకున్నాం కానీ, వదిలేస్తున్నాం అంది కోర్టు… హైదరాబాదులో నటి రేణు దేశాయ్ ప్రెస్ మీట్… ఏదేదో అరిచింది… మగాళ్లు కారా, మీకు మగతనం లేదా… దోమలు కుడితే వ్యాధులు రావడం లేదా వంటి వ్యాఖ్యలూ సందర్భరహితంగా వదిలింది… ఓ సీనియర్ సోషల్ మీడియా యాక్టివిస్టుపై నోరు పారేసుకుంది… ఆమె భాష, ఆమె బాడీ లాంగ్వేజ్… అంతా అయోమయం, గందరగోళం… పెడితే జైలులో పెట్టుకొండి నన్ను అంటోంది.., నా పర్సనల్ లైఫ్ మీద ట్రోలింగ్ సాగుతోంది అంటోంది… మళ్లీ వరుసగా వీడియోలు పెడుతోంది… నాకెవరూ తోడు లేరు అంటుంది ఓసారి, కల్కి సినిమా తెలుసుగా అలాగైపోతారు అని శాపనార్థాలు పెడుతోంది… ఆమెకు నిజంగా ఏదో అయింది… ఓ కొత్త రేణు దేశాయ్ కనిపిస్తోంది… ఆమెను చూసి యాంకర్ రష్మికి కూడా ఏదో అయింది… కొత్తిమీరలో ప్రాణం, పాలు- జున్ను దాకా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావడం లేదు… (అమ్మలూ, మీకు తెలిసిన హిందీయో, ఇంగ్లిషో మాట్లాడండి, తెలుగును ఖూనీ చేయకండి…) థాంక్ గాడ్… వీథి కుక్కలు అనగానే గుర్తొచ్చే అమలమ్మ ఇంకా రంగంలోకి రాలేదు… సరే, ఇవిలా నడుస్తూనే ఉన్నాయి కదా… నిన్నటి ఓ వార్త ఇది… హైదరాబాదులోనే ఓచోట పిల్లాడిపై కుక్క దాడి, గాయాలు… సమయానికి ఎవరో వచ్చేసరికి కుక్క వెళ్లిపోయింది గానీ లేకపోతే పిల్లాడి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది… వీథి కుక్కలపై ప్రేమ చూపించే వాళ్ల కోసం… ఆఫ్టరాల్ కొన్ని కుక్కలు దాడులు చేస్తుంటే అన్ని కుక్కల్నీ చంపేయాలి, షెల్టర్లలో వేయాలా అని వాదించే వాళ్ల కోసం… కొన్ని నిజాలు ఇవిగో… ఇవి ప్రభుత్వం చెప్పిన లెక్కలే… (ఓ వెబ్ పత్రికలో కనిపించింది…) . . . . . . . . . . . . . . . . . . . . . . . రాష్ట్రంలో ఐదేళ్ళల్లో.. * 14,88,781 కుక్క కాట్లు! * 36,07,989 రేబిస్ వ్యాక్సిన్లు * ఆర్టీఐ కింద ఆరోగ్యశాఖ సమాచారం హైదరాబాద్, జనవరి 20 (అడుగు న్యూస్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కుక్క కుక్క కాటుకు గురైన వారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర సమా చార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆరోగ్య శాఖ, 2020 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 14,88,781 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలిపింది. వీరికి మొత్తం 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అలాగే, 2020 జూలై నుంచి 2025 జూలై వరకు రాష్ట్రవ్యాప్తంగా 21,466 మంది పాము కాటుకు గురయ్యారని, వారికి 53,942 పాము విష నివారణ మందు డోసులు అందించినట్లు వెల్లడించింది. ఈ వివరాలను మంగళవారం మీడియాకు తెలియజేసిన రాజేంద్ర మాట్లాడుతూ, వల్లె నుంచి పట్టణం వరకు కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారికంగా నమోదైన లెక్కలేనని, ప్రైవేటు వైద్యం పొందిన వారిని కలిపితే నిజమైన సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కుక్కల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ ఇవి ప్రభుత్వ హాస్పిటళ్ల లెక్కలు… ప్రైవేటు హాస్పిటళ్లవీ కలిపితే ఇంకెన్నో… నిజంగానే పరిస్థితి భీకరంగానే ఉంది… నిష్ఠురంగా ఉన్నా ఇంకొన్ని నిజాలు కూడా చెప్పుకోవాలి… ఈమధ్య కొన్ని తెలంగాణ పల్లెల్లో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొన్ని వందల వీథి కుక్కల్ని చంపించేశారు… కేసుల పాలవుతామని తెలిసీ చంపిస్తున్నారంటే ఆయా ఊళ్లల్లో సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ప్రజలు ఎంత భయాందోళనల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు… మరోవైపు ఓ మంత్రి కుక్కల్ని చంపితే కేసులు పెడతాం అంటోంది… కేసులు పెట్టి, చంపిన కుక్కల శవాల్ని బయటికి తీసి, పోస్ట్ మార్టం చేయిస్తున్నారు… కానీ ఈ సమస్య నివారణకు ఏం చేయాలనేది మాత్రం ప్రభుత్వం పట్టించుకోదు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు… పసివాళ్ల ప్రాణాలకు గండం… మరేం చేయాలి సర్పంచులు..? పట్టుకుని స్టెరిలైజ్ చేసి వదిలేయాలట… పోనీ, ఈ కార్యక్రమాన్నైనా పకడ్బందీగా చేసే ప్రభుత్వ కార్యాచరణ ఏది..? దానిపై దృష్టి ఏది..? నిజమే, చాలామంది చెబుతున్నట్టు… బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకునే బాధితుడికి తెలుసు బాధ ఏమిటో… ఏసీ కార్లలో భద్రంగా తిరిగే జీవకారుణ్యవాదులకు ఎలా అర్థమవుతుంది…? ఐదేళ్లలో ఒక్క రాష్ట్రంలో 36 లక్షల రేబిస్ వేక్సిన్లు అంటే… ఇది సమస్య తీవ్రత కాదా..? మరింత కటువుగా ఉన్న నిజం ఏమిటంటే… రోజూ ఆహారం కోసం ఎన్ని కోట్ల జీవుల్ని చంపేయడం లేదు..? దేవుళ్లకు బలి కూడా ఇవ్వడం లేదా..? ఈ జీవ కారుణ్యవాదుల్ని తీసుకెళ్లి, ఒక్కసారి అల్ కబీర్ జంతు మాంస ఉత్పత్తి ఫ్యాక్టరీలో లోపల ప్రక్రియ తీరు చూపించాలి… *జీవ కారుణ్యం మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది...! లేదా, తమ దాకా వస్తే గానీ అర్థం కాదు..! చాలా మంది మనసు కలుక్కుమనవచ్చుగాక... కానీ రియాలిటీ మాత్రం ఇదే..!!*