ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఇదే సాయిభక్తులకు తారక మంత్రం .ఉద్ధరింప చేసేది ,పరమ పవిత్రమైన మంత్ర సమానము
బీజా అక్షరములు గల మంత్ర సమానము
మీకు కాలం గడవడం లేదనుకొప్పుడు ,మీ మనసు అశాంతిగా ఉందనుకొన్నప్పుడు ,మీరు
విశ్రాంతిగా గడపాలనుకొన్నప్పుడు ,మీ కుర్చీలో
మీరు కూర్చుని ,లేక పడుకొని ,కళ్ళుమూసుకొని
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అని
మంత్ర జపం చేసుకోవచ్చు .
షుమారు 57 సం .లకు పూర్వము షిరిడీలో సాయి సమాధి
మందిరములో ,రాత్రిపూట నిద్ర పొతున్న ఒక సన్యాసి ఎదురు రొమ్ముల మీద సాయబాబా కూర్చొని అతని చొక్కా పట్టుకొని లేపి "ఓం సాయి
శ్రీసాయి జయజయ సాయి అనే నామ మంత్రాన్ని
మూడు సార్లు చెప్పించి అంతర్ధానమైనారు .
ఆ సన్యాసి తెల్లవార్లూ దాన్నే ఆలోచిస్తూ ,అక్కడ గల
భక్తులకు ఆ విషయము చెప్పి వారిచే ఆ నామాన్ని
పలికింపచేసారు .ఈ సమాచారాన్ని షిర్డి సాయి
సంస్థాన్ వారు సాయి లీలా మాసపత్రికలో ప్రకటించారు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ మంత్రంలో ఒక చక్కటి లయ ఉన్నది .ఆ నామం ఉచ్చరిస్తుంటే మనసుకు ఎంతో ఎనలేని ప్రశాంతత లభిస్తుంది .
ఓం సాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన పరబ్రహ్మయే అని ,శ్రీ సాయి అంటే లక్ష్మీదేవితో
కూడిన పరబ్రహ్మమే అని ,జయ జయ సాయి
అంటే నీకు శుభం కలుగు గాక "అని వేడుకోవడం
జరుగుతుంది .
అయనకు శుభం కలుగుగాక అనడంలో ఆంతర్యమేమనగా మన అందరికీ ఆయన అనుగ్రహ ఆశీస్సులు కలగాలని తద్వరా అన్నీ శుభములు కలగాలని ప్రార్ధించుటయే.
#🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా