Jaya Lakshmi Gopisetti
534 views
12 days ago
#🇮🇳#INDvsNZ on Jio Cinema🏏 #gods #🤞வாழ்த்துக்களுடன் நம்பிக்கை செய்தி🙏 #🛕ஐயப்பன் கோவில்கள்🙏🏼 #🙏ஏகாதசி🕉️ 🌹🌹స్వామి వివేకానంద జయంతి జనవరి 12వ తారీకు 🌹🌹 బెంగాలీలో షామీ బిబేకానందో ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. ,🌹🌹1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాల, ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన, పవిత్రమైనది, ఆలోచనకి, నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను 🌹🌹 🌲🌹జననం నరేంద్రనాథ్ దత్తా 1863 జనవరి 12🌲🌹 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) 🌲💐నిర్యాణము 1902 జులై 4 (వయసు: 39) బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)🌲💐 🌹🌹జాతీయత భారతీయడు🌹🌹 🍎🌲స్థాపించిన సంస్థ బేలూరు మఠం, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్🍎🌲 🪻🪻గురువు రామకృష్ణ🪻🪻 💚తత్వం వేదాంత💚 💙సాహిత్య రచనలు రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ💙 🤎ప్రముఖ శిష్యు(లు) స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత, స్వామి సదానంద🤎 ♥️నొక్కి చెప్పినవి అనుసరించిన పలుకులు"లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేదాక ఆగవద్దు" మరిన్ని పలుకులు.♥️ భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రెసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. నరేంద్రుడు ఏకసంధాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు. రామకృష్ణ పరమహంస గురుదేవునితో వివేకానందుని పరిచయం వివేకానందుని జీవితాన్ని మార్చివేసింది. స్వామి వివేకానంద అప్పటినుంచి సంపూర్ణ జ్ఞానవంతుడై క్రమంగా దృఢమైన, స్పష్టమైన, ప్రణాళికతో ముందుకు సారి. అనేకమందికి జ్ఞాన జ్యోతులను వెలిగించాడు. భారతదేశ వేదాంతం సాంస్కృతి ప్రపంచంలోనే అత్యుత్తమమైనగా విశ్వవ్యాప్తం గావించాడు. రామకృష్ణ మఠం స్థాపించి. ఎన్నో ధార్మిక కార్యక్రమాలను, ప్రజా ఉపయోగకరమైన పనులను దేశ విదేశాల్లో విస్తరింపజేశారు. రామకృష్ణ పరమహంస మొదటి నుంచి విశ్వానికి తన ఆత్మ దర్శన జ్ఞానంతో చేయదలుచుకున్న గొప్ప ఉపకారాన్ని సాధించి, భారతీయులకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకుడు అయినాడు.