*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷జనవరి 22🌷*
*"ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన*
*మగ్దలేనే మరియ కు మొదట కనబడెను" (మార్కు 16:9)*
ప్రభువు తాను పునరుర్ధానుడైన పిమ్మట ఆదివారము (ఈస్టర్) ఉదయమున మగ్దలేనే మరియ అను ఒక స్త్రీ కి కనబడెను. ఆమె ప్రభువు యెడల ఎంతో భక్తి కలిగి యున్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుర్ధానము ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికీ, ఆయన యందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలిసికొనలేదు. ప్రభువైన యేసు క్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాటలాడుచుండెను, గాని ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనుక ఏడ్చుచుండెను. *నేడు ప్రపంచ మంతటా చాలా మంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము గాని, వారు ప్రతి పరిస్థితిలోను అత్యధిక విజయశాలురు కావలెనని ప్రభువు కోరుచున్నాడు. వారి ఏడుపుకు కారణమేమనగా, ప్రతి అక్కర కొరకు పునరుర్ధాన శక్తిని ఏలాగున అన్వయించుకొనవలెనో ఎరుగరు.*
ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు, ఆమె ఆయనను గుర్తించెను. ఆమె తనకు ఆయన యెడల నున్న ప్రేమను, భక్తిని కనపరచుటకు గాను ఆయన పాదములను ముట్టుకొనవలెనని కోరెను గాని, ప్రభువు ఆమెతో " నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు" అనెను (యోహాను 20:17), కొద్ది సమయము తరువాత, ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన అనుమతించినట్లు మత్తయి 28:9 లో చదువుదుము. తరువాత పునరుర్ధానమునకు ఎనిమిది దినముల పిమ్మట ఆయన తోమాతో, " నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము: నీ చెయ్యి చాచి నాప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను" (యోహాను 20:27) కావున మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలెనని కోరినను ఆయన ఒక ఉద్దేశముతోనే అనుమతించలేదు. హెబ్రీ. 9:12, ప్రకారము మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన స్వంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడాయెను. కీర్తనలు 16:10 ప్రవచనము ప్రకారము ఆయన శరీరము కుళ్లుపట్టలేదు. మరియు ఆయన రక్తము కూడా ఏ మాత్రము కుళ్లుపట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసు క్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుర్ధాన శక్తిని అనుభవించ గోరుచున్న యెడల మన అక్కరకొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయము ఆయన యొద్ద వేచియుండవలెనని చూచుచున్నాము. ఆయన మనతో మాటలాడుటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్యనిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి యున్నది. *విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనలను మనము ఉంచుకొనవలెను. అప్పుడు మనము పునరుర్ధాన శక్తిని అనుభవించగలము.*
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝