మన హృదయంలో ఏదో స్పందన కలిగి మనకు ఆనందం అనుభవమవుతుంది.* మనం కోరుకొనేది మనమిక్కడ పొందుతున్నాము అనిపిస్తుంది. బాబా చూసుకుంటారు,
మన కోసం ఆయన ఉన్నారు అనే భద్రతాభావం కలుగుతుంది. చాలా సందర్భాలలో మనం ఆనందాన్ని కోల్పోవడానికి మనలోని భయాలు, అభద్రతాభావం కారణమవుతాయి. కొన్నింటికి కారణాలు ఉంటాయి, కొన్నింటికి కారణాలు ఉండవు. కారణాలు ఉన్నా, లేకున్నా వాటి వలన మన ఆనందానికి భంగం కలుగుతోంది.
సద్గురు సన్నిధిలో మనకు అటువంటి అభద్రతాభావం కలగదు. ఆయన సన్నిధిలో మనకు ప్రప్రథమంగా అనుభవమయ్యేది ఇదే. బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు, నాకు ఏం కావాలో ఆయనకు తెలుసు అనే భద్రతాభావం కలుగుతుంది.బాబా నుండి ఆ రక్షణను మనం ఇంకా పొందకపోవచ్చు, కానీ మాటలకందని ఆ అనుభూతి కలుగుతుంది.
ఎక్కడైతే అటువంటి సంతోషాన్ని, భద్రతను మనం అనుభూతి చెందుతామో అదే గురుస్వరూపం, మన సద్గురు స్వరూపం.నిజానికి సద్గురువు అంటే ఏమిటి ? మన అంతరంగంలోని అస్పష్టమైన సంపూర్ణత్వానికి, ఆనందానికి స్థూలరూపమే ఆయన
#🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇