👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
951 views
9 days ago
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ! శ్రీ కృష్ణ! యదుకులవిభూషణ! విజయమిత్ర! శృంగార రసరత్నాకర! జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించి వేసిన వాడ! జగదీశ్వర! ఆపన్నులైన అమరుల, అవనీసురుల, ఆవులమందల ఆర్తులను బాపువాడ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకు ఈ భవబంధాలను తెంపెయ్యి. #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚 #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏 #కృష్ణం వందే జగద్గురుం #🚩కృష్ణం -వందే జగద్గురుమ్🙏