SaHiLkHaN1521
1.7K views
14 days ago
ప్రవక్త సతీమణి హజ్రత్ అయిషా (రజి) ఇలా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ (ﷺ)కు రేపటి రోజు సంభవించే విషయాలు తెలుసని ఎవరైనా అంటే, అతను దేవుని మీద పెద్ద అభాండం చేస్తున్నాడన్నమాట. యావత్తు భూమ్యాకాశాల్లో అతీంద్రియజ్ఞానం దేవునికి మాత్రమే ఉందని దేవుడే తెలియజేస్తున్నాడు." (సహీహ్ ముస్లిం) దైవప్రవక్త ముహమ్మద్ (ﷺ) ప్రవచనం: "మీలో ఎవరైనా జోతిష్యుని దగ్గరకు వెళ్ళి ఏదైనా అడిగి అతను చెప్పేదాన్ని నిజమని భావిస్తే అలాంటి మనిషి చేసే నమాజ్ నలభై రోజులు వరకు స్వీకరించబడదు." (ముస్లిం) దైవప్రవక్త ముహమ్మద్ (ﷺ) ప్రవచనం: "నక్షత్రవిద్య నేర్చుకున్నవాడు చేతబడి విద్య నేర్పు కున్నట్లే. ఆ విధంగా అతను ఎంత నక్షత్రవిద్య నేర్చుకుంటే అంత చేతబడి విద్య నేర్చు కున్నట్లవుతుంది." (అబూదావూద్) #Pravaktalasandesham #ప్రవక్తలసందేశం #✨ఇస్లాం హదీస్✨ #🤲🏻అల్లా హే అల్లా🕋 #🕌నమాజ్ #🤲🏻ఇస్లాం ధర్మం ☪ #🤲🏻దువా☪