newsads org
531 views
1 months ago
ఏ పార్టీకి ఓటు వేసినా, ఏ నాయకుడికి ఓటు వేసినా *78 సంవత్సరాలుగా రైతుల మరియు ప్రజల బ్రతుకులు, జీవితాలు మారలేదు. రైతులు మరియు ప్రజలు అభివ్రుద్ధి చెందడం లేదు. అప్పుల్లోనే ఉంటున్నారు*. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకుల (పాలకుల) ఆలోచనలు మారట్లేదు. ఇకమీదట మనమే (రైతులం) మారదాం. మన రైతుల ఆలోచన మార్చుకుందాం. మనమే భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో నిలబడదాం. మన ఓట్లు మనకు వేసుకుంటే రైతులే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలుస్తారు. అధికారం మన చేతుల్లో ఉంటుంది. *రైతులమే ఒక పార్టీ పెడితే (స్థాపిస్తే) బాగుంటుంది* జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు ప్రతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడం లేదు. ఓట్లు వేయించుకున్న *రాజకీయ నాయకులు* మాత్రం అధికారంలోకి వచ్చి అభివ్రుద్ధి చెందుతున్నారు! *గమనిక* :: ఈ మేస్సేజ్ స్థానిక సంస్థల, మున్సిపల్ (సర్పంచ్, ఎం.పి.టి.సి, కౌన్సిలర్, కార్పోరేటర్ మొ//గు) ఎన్నికల గురించి కాదు. *అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే* ... దళారీ వ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు (పాలకులు) దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యలేకపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు వేయించుకుని ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిచిన నాయకులకు.. క్యాంప్ ఆఫీసులు, లగ్జరీ కార్లు, క్వార్టర్లు, హెలీకాప్టర్లలో ప్రయాణం, వ్యవసాయం చెయ్యకపోయినా ఎకరాల కొద్దీ భూములు, పెన్షన్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. రైతులు పండించిన వడ్ల ధర మాత్రం ఒక క్వింటాలుకు రూ// 3000 దాటలేదు. ఓట్లు వేసిన రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు చాలా మందికి ఇప్పటికి స్వంత ఇండ్లు లేవు. 100% ఉచిత విద్య, 100% ఉచిత వైద్యం అందడం లేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. రైతులు పండించిన తమ పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు. సిగరెట్, బీడి, కూల్ డ్రింక్స్, కార్లు, ఆటో, లారీ, మద్యం తయారీ, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్, ఫోన్లు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఏ వస్తువు తయారు చేసే కంపెనీ వారైనా తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు. కానీ, మన రైతుల దరిద్రం ఏమిటంటే మనం పండించిన పంటల (వడ్లు, మక్కలు, కందులు, వేరుశెనగ, పెసల్లు మొ//గు) ధరల్ని మాత్రం ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అంతే గాక వ్యాపారులు నిర్ణయిస్తారు. వ్యాపారులు ధరను ఎలా నిర్ణయిస్తారు అనే అనుమానం మీకు కలగవచ్చును. ఎలా అంటే, అడ్తిలో కూరగాయలకు ధరలు నిర్ణయించడానికి వేలంపాట పాడతారు! రైతులు తమ కూరగాయల్ని వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా అమ్ముకుందామంటే, కోనేవాళ్లు అడ్తిలో ఖరారు అయిన ధరకే బయట రైతుల వద్ద కొంటారు. రైతులు తాము పండించిన పంటలకు తామే ధరను నిర్ణయించే పరిస్థితి లేదు!. జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు మన రైతులకే వేసుకుంటే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిస్తే, అధికారం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు మనం మన రైతుల పంటల్ని నేరుగా ప్రజలకి అమ్ముకోవడానికి 1). ప్రతీ గ్రామంలో ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. (బియ్యం, పండ్లు, పూలు, కూరగాయలు వివిధ రకాల పంటలు నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును) 2). పట్టణాల్లో, నగరాల్లో ప్రతీ 5000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. 3). ప్రభుత్వ హాస్టల్స్, క్యాంటీన్స్, జైళ్లు, అంగన్ వాడీ సెంటర్స్ మొ//గు ప్రభుత్వానికి సంబంధించిన వాటికి బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు మొ//వి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవచ్చును. 4). దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 5). మార్కెట్లను ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచిఉంచేలా చర్యలు తీసుకోవచ్చును. అప్పుడు రైతులు ప్రతీరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకోవచ్చును. రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకోవచ్చును. 6). ప్రజలకు 100% ఉచిత వైద్యం అందించవచ్చును. 7). విద్యార్థిని, విద్యార్థులకు 100% ఉచిత విద్య అందించవచ్చును. అత్యద్భుతమైన పరిపాలనను ప్రజలకు అందించవచ్చును. ఇంకా 100 సంవత్సరాలు ఈ రాజకీయ పార్టీలకు, నాయకులకు ఓట్లు వేసినా మన బ్రతుకులు, జీవితాలు మారుతాయా? ఇప్పటికైనా రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు మరియు ప్రజలందరు ఒక్కసారి ఆలోచించండి! మోసపోవడమే తప్ప మోసం చెయ్యడం తెలియని రైతుల్ని భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిపించుకుందాం. ప్రజలందరి జీవితాలు మారుతాయి. బ్రతుకులు బాగుపడతాయి. మనం ప్రతీ ఎన్నికల్లో ఎలాగూ ఓట్లు వేస్తాము. ఆ వేసే ఓటు ను *రైతుల్ని అధికారంలోకి తీసుకు రావడానికి ఉపయోగిద్దాం*. *జై కిసాన్* *రిక్వెస్ట్* :: ఈ మెస్సేజ్ మీకు నచ్చితే మరికొంతమంది రైతులకు & ప్రజలకు *షేర్/ఫార్వర్డ్* చెయ్యాలని మనవి. --------- *రైతు* *జంగ చంద్రారెడ్డి* వాట్సాప్ నంబర్ : 8790020043 ----------- #@jai telangana....💕 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #తెలుగు టైమ్స్ న్యూస్ #తెలుగు న్యూస్ పేపర్ #telugu