నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
1.8K views
ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదనీ.. తల్లిదండ్రులనే చంపిన కుమార్తె! సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ కుర్రాడి మత్తులో పడి ఏకంగా కన్న తల్లిదండ్రులనే మట్టుబెట్టింది ఆ కూతురు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారంలో జనవరి 24న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌, జనవరి 29: కూతురిని గుండెల మీద కుంపటిలా భావించకుండా చక్కగా పెంచి.. చదివించా తల్లిదండ్రులు. అడిగిందల్లా తెచ్చి క్షణాల్లో ఆమె ముందు పెట్టారు. అయితే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ కూతురే తమ ప్రాణాలను హరించే విషమని తెలియక ఆ తల్లిదండ్రులు మోసపోయారు. సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ కుర్రాడి మత్తులో పడి ఏకంగా కన్న తల్లిదండ్రులనే మట్టుబెట్టింది ఆ కూతురు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారంలో జనవరి 24న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్‌, లక్ష్మి దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అశోక్‌ హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇక కుమార్తె సురేఖ (25) బీఎస్సీ నర్సింగ్‌ చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే సురేఖకు ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం సురేఖ తన తల్లిదండ్రులకు చెప్పి, పెళ్లి చేయమని కోరింది. అయితే అందుకు వారు అంగీకరించలేదు. అయితే పెళ్లికి అడ్డు చెబుతున్నారనీ సురేఖ కన్న తల్లిదండ్రులపైనే కక్ష్య కట్టింది. ఎలాగైనా ప్రియుడిని దక్కించుకోవాలన్న అత్యాశతో కన్నోళ్లను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రుల హత్యకు పథకం పన్నింది. వృత్తి రిత్యా నర్స్ కావడంతో ఎక్కువ డోస్‌ మత్తుమందు ఇంజక్షన్‌ ఇచ్చి చంపాలని భావించింది. ఇందుకు తాను పనిచేస్తున్న హాస్పిటల్‌లోనే అట్రాక్యురియం, అర్టాసిల్‌ 2.5 ఎంఎల్‌ అనే మత్తు ఇంజక్షన్లు 4 బాటిళ్లు దొంగతనం చేసింది. జనవరి 24న సంగారెడ్డి నుంచి మోమిన్‌పేట్‌కు వెళ్లి మెడికల్‌ షాప్‌లో 3 సిరంజీలను కొనుగోలు చేసి యాచారానికి వచ్చింది. అదే రోజు రాత్రి తల్లిదండ్రులతో మరోమారు ప్రేమ విషయాన్ని ప్రస్తావించగా వారు నిరాకరించారు. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్‌ తెచ్చానని చెప్పి.. ముందే తెచ్చుకున్న మత్తుమందును మోతాదుకు మించి ఇచ్చింది. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం ఏం తెలియనట్టు అన్న అశోక్‌కు ఫోన్‌చేసి అమ్మానాన్నలు చనిపోయారని, భయంగా ఉందని బోరున ఏడ్చింది. అశోక్‌ వచ్చి చూడగా అమ్మానాన్నల మృతి అనుమానంగా అనిపించింది. అప్పుల బాధతో చనిపోయినట్టు కూతురు డ్రామా క్రియేట్ చేసింది. ఇద్దరు కుప్పకూలితే సీపీఆర్ కూడా చేశానని అయినా బతకలేదని మరో డ్రామా ఆడింది. దీంతో అన్న అశోక్ అనుమానంతో వెంటనే బంట్వారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేయగా.. ఇంట్లో నాలుగు ఇంజెక్షన్‌ బాటిళ్లు, 2 సిరంజీలు లభించాయి. తొలుత అనుమానం కింద సురేఖను విచారించగా.. తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించింది. దీంతో ఆమెను ఆమెను అరెస్ట్‌ చేసి కటకటాల్లో వేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. #😱మత్తు ఇంజక్షన్‌తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు

More like this