Ranjani Rajesh
1K views
*స్ధిర వాసర (శనివారం) ఆనంద శుభోదయం.* 🪷🪷 *మాఘమాసం శుక్లపక్షం త్రయోదశి ఉదయం 7.48 వరకు, శని త్రయోదశి.* 🪷🪷 *చతుర్దశి శనివారం సిధ్ధ యోగం ఉదయం 7.48 నుంచి మరుసటి రోజు ఉదయం 5.58 వరకు.* 🪷🪷 *చరిత్రలో నేడు 31st Jan* నేడు అంతర్జాతీయ జీబ్రా ( చారల గుర్రం ) దినోత్సవం. ________ *31.1. 1948* *అహింసామూర్తిగా బాగా ప్రచారం, ఆదరణ పొందిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా అనేక నగరాలలో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, హత్యా కాండ.లెక్కలకి రాకుండా లెక్క లేనంత మంది సామూహిక మారణకాండ లో హత్య కావించి బడ్డారు.* 👇👇👇 *గాడ్సే మీద ఆగ్రహంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనుషులపై, ఆస్తులపై అన్ని రకాలుగా విధ్వంసకరమైన దాడులు. గాడ్సే ఇంటి పేరు పూర్తిగా నిర్మూలన. ఈ అల్లర్లను హత్యలను విధ్వంసాన్ని అదుపు చేయడంలో షరా మామూలుగా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క ఉదాసీనత,నిర్లక్ష్యం.* _______ *31.1. 1949* బరోడా, కొల్హాపూర్ సంస్థానాధీశులు బొంబాయి రాష్ట్రంతో కలవడానికి నిర్ణయించుకున్నారు. _______ *31.1. 1963* నెమలిని మన దేశజాతీయ పక్షిగా ప్రకటించారు. _________ *31.1. 1985* ఇందిరా గాంధీ మరణానంతరం లోక్సభలో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది. ఒక పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరొక పార్టీలోకి వెళ్లడం ఈ చట్టం నిషేధిస్తుంది. లోక్సభలోని అత్యధిక సంఖ్యలో గల తమ పార్టీకి చెందిన ఎంపీలను గోడ దూకకుండా ( పక్క పార్టీలకు మారకుండా ) కాపాడుకోవడానికి ఈ చట్టం తెచ్చారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. .. విచిత్రంగా ఈ చట్టం తర్వాత కూడా, ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటం ఏ మాత్రం తగ్గలేదు. ఈ చట్టంలోని లొసుగులను ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. 2018లో ఏర్పడిన తెలంగాణ అసెంబ్లీలోని కాంగ్రెస్ పార్టీకే చెందిన శాసనసభా పక్షం అనగా మొత్తం ఎమ్మెల్యేలు 19 మందిలో 12 మంది అధికార టిఆర్ఎస్ పార్టీలోకి విలీనం (పార్టీ మారిపోవడం) కావడం గమనార్హం.👇👇👇 *నైతికత పెంపొందించలేని చట్టాల వలన ఉపయోగం ఎంతో ఈ విధంగా తెలుస్తోంది.* ________ *31.1. 1996* ఆసియాలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీని పూనాలో ప్రారంభించారు. ______ 🙏🙏🙏 #చరిత్ర #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🏛️రాజకీయాలు #🇮🇳దేశం