🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
697 views
18 days ago
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థం : నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం వాడపల్లి వేంకటేశ్వరునిది. ఆనంద ధాముడై లక్ష్మీ స్వరూపుడై దర్శనమిస్తాడు. మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయంలో కనువిందు చేస్తాడు. ముందుభాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తుంది. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు, ద్వాదశ గోపాలాలలో ఒకటిగా చెప్పుకునే నారద ప్రతిష్టితమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం చేసుకోవాలి. ఉత్తరం వైపున అలివేలుమంగ, ఆగ్నేయ భాగంలో రామానుజులు, అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి. ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరుని ఆలయం కూడా ఉంది. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామి కల్యాణం, తీర్థం జరుగుతాయి. వాడపల్లి తీర్థం అంటే ఎంతో ప్రసిద్ధి. వేలాదిగా భక్తజనం తరలి వస్తారు. సంతానం లేని వారు వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే సంతానవంతులౌతారని నమ్మిక. పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తరువాత స్వామికి తులాభారం సమర్పించుకునే భక్తులు స్వామి కల్యాణవేళ ఎక్కువగా కనిపిస్తారు. ఏడువారాల పాటు వాడపల్లి వెంకన్న దర్శనం అనంతపుణ్యదాయకం అని విశ్వసిస్తారు. __________________________________________ HARI BABU.G _________________________________________ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #గోవిందా గోవిందా #🌅శుభోదయం #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏 #🙏🌺ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🌺🙏