@ విజ్జి @
674 views
2 days ago
్రీ దేవి భాగవతం నుండి, రుద్రాక్షలు- భేదాలు సనాతన ధర్మం నారాయణమహర్షీ ! రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు. కారణం తెలుసుకోవచ్చా ? నారదా ! ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను. విను. వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు. సర్వదుర్జయుడు. బ్రహ్మాదిదేవతల నందరినీ పీడించుకుతినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శంకరుడు అఘోరము అనే మహాశస్త్రాన్ని ధ్యానించాడు. అది సర్వదేవమయమూ ఘోరాతిఘోరమూను. ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు మూడూ తెరిచాడు. బాష్పజలబిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువులనుంచి మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి. సూర్యనేత్రంనుంచి రాలిపడిన జలబిందువులతో కపిలవర్ణంలో పన్నెండూ, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో పదహారూ, వహ్నినేత్రంనుంచి కృష్ణవర్ణంలో పదిరకాలూ రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత - రక్త - మిశ్ర - కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్ణాలకూ ప్రతీకలు. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తూ శంకరుడే. బ్రహ్మహత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది. ద్విముఖరుద్రాక్ష పార్వతీపరమేశ్వరులు. సకలపాప విమోచకం. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు. స్త్రీహత్యాది పాపాలను సైతం దహించివేస్తుంది. చతుర్ముఖరుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే. నరహత్యాది ఘోరపాపాలనుకూడా తొలగిస్తుంది. పంచముఖీ రుద్రాక్షనే కాలాగ్ని అంటారు. అదే రుద్రుడు. అభక్ష్యభక్షణ అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖరుద్రాక్షమంటే కుమారస్వామియే. దీన్ని కుడిచేతికి ధరించాలి. బ్రహ్మహత్యాదిక పాపాలుకూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మథుడంటారు. స్వర్ణస్తేయాదిపాతకాలు నశిస్తాయి. అష్టవక్త్ర రుద్రాక్షమంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులూ నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్నిగమనాది దోషాలు నశిస్తాయి. నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవుడు. దీన్ని ఎడమచేతికే ధరించాలి. భుక్తిముక్తిప్రదం. మహాబలవర్ధకం. భ్రూణహత్యాదిదోష నాశకం. సద్యఃఫలదాయకం. దశముఖి రుద్రాక్ష సాక్షాత్తూ జనార్ధనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూతప్రేతపిశాచోరగభయాలు అంతరిస్తాయి. ఏకాదశముఖి రుద్రాక్షమంటే ఏకాదశరుద్రులతో సమానం. దీన్ని శిఖలో ధరించినవాడు వెయ్యి అశ్వమేధాలూ నూరువాజపేయాలూ పదివేల గోదానాలూ చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశాస్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులూ చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. అశ్వమేధ గోమేధ యజ్ఞఫలం లభిస్తుంది. క్రూరజంతు క్రూరపురుష భయాలు తొలగిపోతాయి. ఆధివ్యాధులు దరికి చేరవు. పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించినవాడు సాక్షాత్తూ కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛాప్రదం. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి. పధ్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే. దాన్ని శిరస్సున ధరించాలి. శివుడితో సమానుడవుతాడు. నారదా! వెయ్యేల! రుద్రాక్షకు సాటివచ్చే పవిత్రవస్తువు ఈ సృష్టిలో లేదు. దేవతలుకూడా పూజిస్తారు. ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యమూ ధరిస్తే చాలు ఇహపరాలు శుభాస్పదాలవుతాయి. ఇరవైయారు రుద్రాక్షలతో శిరోమాలనూ యాభైతో కంఠమాలనూ వదహారుతో బాహుమాలికనూ పన్నెండుతో మణిబంధమాలికనూ తయారుచేసుకుని ధరించాలి. ఇరవైయేడుగానీ యాభైగానీ నూటెనిమిదిగానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం. ఈ జపమాలలను ధరించవచ్చు కూడా. క్షణక్షణమూ అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది - అని సాక్షాత్తూ శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు. అష్టోత్తరశతైర్మాలా రుద్రాక్షైర్దార్యతే యది । క్షణే క్షణేఒశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి షణ్ముఖ ॥ (అధ్యాయం 4-40) సనాతన ధర్మం నుండి #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status