nvs subramanyam sharma
726 views
13 days ago
🌺 అయ్యప్ప 🌺 అయ్యప్ప అయ్య (విష్ణువు), అప్ప (శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా' అని మరికొందరు 'అప్పా' అని, మరికొందరు రెండు పేర్లూ కలిపి `అయ్యప్ప' అని పిలిచేవారు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఒక వేళ 41 రోజులు దీక్ష చేయకుండా "పదునెట్టాంబడి"ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేదపండితులు అంటారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. తనకు వాహనంగా వున్న పులి ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం. బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి. తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు అభయమిచ్చాడు. 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 . #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🥁స్వామియే శరణం అయ్యప్ప #🕉️ ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప 🙏