18న ఆదివారం మౌని అమావాస్య.. పంచగ్రహ కూటమి కూడ మంచి రోజా - చెడ్డ రోజా........!!
2026 లో, మౌని అమావాస్య జనవరి 18 న జరుపుకుంటారు. అమావాస్య తేదీ జనవరి 18 న తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై జనవరి 19 న తెల్లవారుజామున 1:21 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి సంప్రదాయం ప్రకారం, ఈ పండుగ జనవరి 18 న జరుపుకుంటారు.
మౌని అమావాస్య రోజున చేయాల్సిన పనులు...
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి.. మందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఎవరితో మాట్లాడకుండా.. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ..సూర్య నమస్కారాలు చేయాలి.
ఆ తరువాత దగ్గరలో కృష్ణ, గోదావరి లాంటి పుణ్య నదులు ఉంటే నదీతీరంలో స్నానం చేయాలి
అవకాశం లేకపోతే ఇంటిదగ్గరే పంపు దగ్గర కాని.. నుయ్యి ( బావి) వద్ద కాని స్నానం చేయాలి.
అపార్ట్ మెంట్ కల్చర్ లో అది కుదరదు కనుక వాష్ రూంలో స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పుకొని ముందుగా ఆనీటికి నమస్కరిస్తూ .. గంగేచ, యమునేచ,గోదావరీ, సరస్వతీ, నర్మదే సింధు కావేరి,జల అస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి.
సబ్బు కాని.. షాంపో కాని వాడకూడదు.
శ్రీహరి.. లక్ష్మీదేవి.. గంగామాతను పూజించి.. హారతి ఇవ్వాలి.
శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి.. శివుడికి రుద్రాభిషేకం చేయాలి.
కాలభైరవుడిని పూజించాలి.
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి.
అవకాశం ఉంటే మౌన వ్రత పాటించాలి.
మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది
మౌని అమావాస్య రోజున భగవంతునని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి. అవకాశం ఉంటే ఆరోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు
మౌని అమావాస్య రోజున (జనవరి 18) మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే, వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి.
తరువాత పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ మూడుసార్లు నువ్వులు.. నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి.
ఓం పితృ దేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఆరోగ్యాన్ని అనుసరించి .. ఉపవాస దీక్షను ఆచరించాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి.
శక్తిని బట్టి అన్నదానం.. వస్త్రదానం చేయాలి
సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.
సాయంత్రం మీ ఇంటికి దక్షిణ దిశలో నాలుగు వైపుల దీపం వెలిగించండి.
మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, స్మశానవాటికల దగ్గరకు వెళ్లకూడదు. ఆ ప్రదేశాల్లో క్షుద్ర శక్తులు ఉంటాయి. అమావాస్య రోజున వాటికిశక్తి చాలా ఎక్కువుగా ఉంటుంది.
అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరకు వెళ్లవద్దు.. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూలశక్తులు ఉంటాయి.
ఆరోజున (2026 జనవరి 18) పొరపాటున కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది.
___________________________________________
HARI BABU.G
___________________________________________
#✌️నేటి నా స్టేటస్ #మౌని అమావాస్య విశిష్టత #మౌని అమావాస్య.. ఏం చేయాలి 🤔?? #మౌని అమావాస్య శుభాకాంక్ష #🌅శుభోదయం