#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి రూప విశిష్ఠత
ఆత్మ జ్ణాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజో మూర్తి కడు రమ్యం.
హస్తములద్వారా యిస్తున్న సందేశం
"సంసారసాగరసముత్తరణేతో "అన్నట్లుగా కుడిహస్తముతో తన పాదములను చూపుతూవీటిని శరణువేడితే చాలు సంసారసాగరాన్ని మెాకాళ్ల లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయ హస్త సందేశం యిస్తుండగా ఎడమ చేతి లో నాభిక్రింద స్థానం చూపిస్తూ ప్రాణ వాయువు నాభి క్రిందనుండిఊర్ధ్వ ముఖంగా తీసుకుపోయి సహస్రారంలో వున్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది.కుడి హస్తంలో నా పాాదాలను శరణు వేడితే ఎడమ చేతితో నినునా అక్కున చేర్చుకుంటానన్న సూచన వుంది.
శంఖు ,నామ,చక్రములద్వారా యిస్తున్న సందేశం
శంఖం ద్వారా ఉద్భవించునదిశబ్ధం.శంఖారావంద్వారాజనించేధ్వనిలో రజో,తమెా, గుణములను హరింపచేసే సత్వ గుణమును పెంచేశక్తి వుండడమే కాక విశ్వ చైతన్యమును ఎరుకలోకి తెస్తుంది. కుడిప్రక్క గల నామమును సూర్యనాడిగా,ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా మధ్యగల నామమునుబ్రహ్మనాడిగా చెప్తూంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపచేయమనే సందేశము వుంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితంలో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ణానమును పొందమని జ్ణాన చిహ్నముగాశంఖమునమెాక్ష చిహ్నముగా నామమును కర్మ నాశన శక్తి చిహ్నముగా చక్రమును ధరించి కర్తృత్వభవం లేకుండా జ్ణానమును పొంది తద్వారా కుండలినీ జాగృత మెునర్చి మెాక్షమును పొందవలెనన్న సందేశం ఈ శంఖు,.నామ, చక్రములలో వుంది
శ్రీ వేంకటేశ్వరుని రూపమే ఆత్మ జ్ణాన ప్రబోధకరం అయ్యింది
సర్వతోముఖీ