*తెలంగాణ గడ్డపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.*
నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన కేశవరావు జాదవ్ గారు 1952 ముల్కీ ఉద్యమం నుండి 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ప్రతి పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచారు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చెరగని అధ్యాయం.తెలంగాణ ఉద్యమ ధ్రువతార ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు.
తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి, నిస్వార్థ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. 1952లో విద్యార్థిగా ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న నాటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన చేసిన పోరాటం మరువలేనిది.
పదవుల కోసం ఆశపడకుండా, కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. లోహియా వాదంతో ప్రభావితమై, సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించిన ప్రజాస్వామ్యవాది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (TJAC)లో కీలక పాత్ర పోషించి, అన్ని వర్గాలను ఉద్యమం వైపు నడిపించిన మార్గదర్శి.
ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
*-కప్పాటి పాండురంగారెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు