ప్రక్రియ : నానీలు
అందంతో పొట్టి
పడుతుంది...!!
రెప్పలను రెపరెపలాడించే
శిల్పము...!!
మాటరాని మౌనంతో
యుద్ధం చేస్తుంది...!!
మనసు విప్పి
చెప్పాలని...!!
ఊహలతో
ఎగిరిపోయింది...!!
మయూరమై పురి విప్పి
నాట్య మాడాలని...!!
ఇష్టం కోసం
ఎదురుచూస్తుంది...!!
గాయపడ్డ చిలుక
తలపు వాకిట్లో...!!
వెన్నెల వర్షంలో
తడుస్తుందంట...!!
అమావాస్య జీవితానికి
ముగింపుగా...!!
రాలిన ఆశలు
రాగాలు తీస్తున్నాయి...!!
పూలు పరిమళం
ఎదలో వీస్తుంటే...!!
పట్టు పాన్పు
ఎక్కాలని ఉంది...!!
ఊరించే ఆశ ఒకటి
కళ్ళెదుట మెరుస్తుంటే...!!
____________
మల్లిన గణపతి
#✍️కవితలు