దాట్ల వెంకట సుబ్బరాజు
7.1K views
22 days ago
తిరుప్పావై – ధనుర్మాసం | పాశురం 16 నాయగనాయ్ నిన్ద్ర నందగోపనుడైయ కోయిల్ కాప్పానే, కొడిత్తోనృం తోరణ వ్రాయిల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్, ఆయర్ శిఋమియరోముక్కు, అతైపటై మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరందాన్, తూయోమాయ్ వందోం తుయిలెళప్పాడువాన్, వాయాల్ మున్నమున్నం మాట్రాదే అమ్మా, నీ నేయ నిలైక్కదవం నీక్కేలోరెంబావాయ్ భావము మాకందరికీ నాయకుడైన నందగోపుని తిరుమాళిగను కాపాడువాడా! మేము వ్రేపల్లెలో పుట్టిన గొల్లపిల్లలమే అయినా, స్వామి యందు అపారమైన ప్రేమ కలవారము. పరిశుద్ధులమై వచ్చాము. అన్య ప్రయోజనాలు లేవు.* శరణాగతి చేసుకున్న వారమే. ఇంద్రనీల మణివర్ణుడైన శ్రీకృష్ణుడు - నిన్ననే మాకు ‘ప’ అనే ధ్వనించెడు వాద్యమును ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి ఈ ఉదయం స్వామిని సుప్రభాతంతో మేలుకొలపడానికి వచ్చాము. అమ్మా! నీ నోటితో “వద్దు” అని చెప్పకు. మమ్మల్ని అడ్డుకోకు. ధృడంగా మూసిన ఈ గడియను ఇప్పుడే తెరచి మమ్మల్ని లోనికి అనుమతించు. * జీవన సందేశం భక్తి అంటే అర్హతలు చెప్పుకోవడం కాదు... వాగ్దానాన్ని నమ్మి అనన్యంగా నిలబడటం. మనము గొప్పవాళ్లం కావచ్చు... కాకపోవచ్చు. కానీ శరణాగతి నిజమైతే ద్వారాలు తప్పకుండా తెరుచుకుంటాయి. తలుపు బయట నిలబడి వాదించడం కాదు... వినయంగా వేడుకోవడమే భక్తి. నీ నేయ నిలైక్కదవం నీక్కేలోరెంబావాయ్ . #గోదాదేవి తిరుప్పావై