KP@KALIPRASAD
5.5K views
1 days ago
*బిర్యానీ తింటుంటే దాడి చేసిన చోరీలో.. బిగ్ ట్విస్ట్...వీళ్ళ మైండ్ గేమ్ మాములు గా లేదుగా...కేసు ను చేధించిన పోలీసులు* పల్నాడు జిల్లా కారంపూడి ఈ నెల 17న నరమాలపాడు వద్ద రోడ్డు పక్కన బిర్యానీ తింటున్నప్పుడు జరిగిన 30 లక్షల రూపాయలు, 13 కిలోల వెండి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుర్గికి చెందిన సాంబశివరావు తన గోల్డ్ షాప్ గుమస్తా కొడుకు వెంకటేశ్‌కు ఈ డబ్బు, వెండిని పిడుగురాళ్లలోని చందు వద్దకు ఇవ్వమని పంపాడు. అయితే, వెంకటేశ్ తన స్నేహితులతో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసి, తనపై దాడి చేయించుకుని డబ్బును ఎత్తుకెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో ఈ కుట్రను బట్టబయలు చేశారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢