ఇక, నెల రోజుల పాటు కొనసాగే కల్పవాస్ సమయంలో గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. సంప్రదాయం ప్రకారం భక్తులు కల్పవాస్ సమయంలో రోజుకు రెండు పర్యాయాలు గంగా నదీ స్నానం, ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ధ్యానం, దైవారా ధనలో గడుపుతారు. మొదటి రోజైన శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది భక్తులు సంగం ప్రాంతానికి తరలివచ్చినట్లు అధికారుల అంచనా. అదే సమయంలో, దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పవాస్ దీక్షను ప్రారంభించారని త్రివేణీ సంగం ఆర్తి సేవా సమితి ప్రెసిడెంట్ ఆచార్య రాజేంద్ర మిశ్రా తెలిపారు.
#🆕Current అప్‌డేట్స్📢