Ram Pothini
554 views
25 days ago
సోమవారం నాడు శివుడిని పూజిస్తే.... ఋణ బాధలు ( అప్పులు ) వదిలిపోతాయి.............!! శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు.మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి. సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. #🌅శుభోదయం #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😴శుభరాత్రి #🥳Celebrations Video🎆