Amudalapalli Govardhan
414 views
#☸🙏సూర్యనారాయణ స్వామి *రధ సప్తమి శుభాకాంక్షలు* దేవమాత ఆదిత్యకశ్యప వరపుత్రుడివై సప్తాశ్వ ఏకచక్ర రధంపై సప్త లోకములకు జ్ఞాన సంపదలు అందించి సకల పాపములను భస్మీపటలం గావించే సర్వశక్తిమంతుడవు.. సృష్టికర్త విశ్వకర్మ కూతురు సంధ్యా దేవికి ఇష్టసఖుడవై సర్వ దిగంతాలకు వెలుగువై భూమండలం పై జీవరాశికి ప్రాణదాతవై ప్రత్యక్ష సాక్ష్యంగా కాలచక్రం గిర్రున తిప్పుతూ ఋతువులు ఏర్పరిచి.. పృకృతిలోని అసహజ పరిస్థితిని సరిచేయు దినకర కోటి ప్రభాకరా దివాకరా నమోస్తుతే.. ఉదయం బ్రహ్మ స్వరూపంతో మధ్యాహ్నం విష్ణు రూపంలో సాయంసంధ్య మహాశివునిగా సృష్టి స్థితి లయ చేయు త్రిమూర్తులు నీలోనే సాక్షాత్కారం జగమంత ప్రతి క్షణం చూడగల చక్షువులతో.. ప్రత్యక్ష దైవంగా భాసిల్లే సూర్య దేవాయ నమో నమః ఉషోదయ శుభం* *గోవర్ధన్ ఆముదాలపల్లి* #షేర్ చాట్ బజార్👍 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #⛳భారతీయ సంస్కృతి