👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
434 views
14 hours ago
🌷🌻#ఈరొజు_వసంత_పంచమి_అనగా #సరస్వతి_దేవి_పుట్టినరోజు🌻🌷 🌻#వసంత_పంచమి_రోజున_సరస్వతి_దేవిని_ఏలా #పూజించాలి_అని_తెలుసుకుందాం_బుజ్జి🌻 🌻"మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః - 🌻 🌻అంటే మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 🌻సరస్వతీ దేవిని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. ఆదిశంకరుడు అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొనడమే గాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం. 🌻'యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..' అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారూ. 🌻#సరస్వతి_దేవి_పూజలో_నైవిద్యం_ఏమి_పెట్టాలి🌻 🌻చదువుల తల్లి సరస్వతి దేవి విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది. 🌻ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలకరించబడి వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. 🌻సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. 🌻#సరస్వతి_చెట్టు🌻 🌻హిందూ ధర్మం లో ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 🌻విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు.ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచుతుంది. రకాన్నిశుద్దీకరిస్తుంది. 🌻ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట. 🌻#శ్రీ_పంచమి #అక్షరాభ్యాసం_సందర్భంగా🌻 🌻వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.హ. అని రాసి దిద్దిస్తారు. 🌻#అక్షరాభ్యాసం_ఎలా_చేయాలి 🌻 🌻విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ. 🌻పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం. 🌻సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. 🌻మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. 🌻ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. 🌻 విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. 🌻#శ్రీ_సరస్వతీ_దేవి_ద్వాదశ_నామ_స్తోత్రం🌻 🌻సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ హంసవాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీం తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ. ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం 🌻ఓం శ్రీ మహా సరస్వతీ దేవ్యై నమః🌻 🌻సరస్వతి దేవి స్తోత్రం🌻 సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా | ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః || శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః | శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || #వసంత పంచమి శుభాకాంక్షలు.. 🙏 #📚 సరస్వతీ దేవి 🙏 #సరస్వతి దేవి #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #sri panchami(sarswati devi)