Sąíkűmąŕ $@i
642 views
2 days ago
*ఛేదంచేశారు* * న్యూజిలాండ్‌తో రెండో టీ20.. భారత్‌ లక్ష్యం 209.. రెండు ఓవర్లకు స్కోరు 2/6. సంజు శాంసన్‌ తొలి ఓవర్లోనే ఔట్‌ కాగా.. గత మ్యాచ్‌లో మెరిసిన అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయ్యాడు. ఈ స్థితిలో ఉన్న జట్టు 16వ ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ రాయ్‌పుర్‌లో టీమ్‌ఇండియా ఆ అద్భుతమే చేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, శివమ్‌ దూబె సిక్సర పిడుగుల్లా చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని ఊదేసింది. అయిదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. #news #cricket #sports #sharechat