P.Venkateswara Rao
544 views
7 days ago
#ఒకే ఒక్కడు #🏏 హిట్‌మ్యాన్ -ROHITH🔥 *రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు..❗* 11.02.3025🏏 టీమిండియా దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే క్రీడాకారుడు సాధించలేని ఘనతను అందుకున్నారు. ఇవాళ గుజరాత్‌లోని వడోదర మైదానం వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతో, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లను చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (93), శుభ్‌మన్‌ గిల్ (56) హాఫ్ సెంచరీలు చేయగా.. శ్రేయస్ అయ్యర్ (49), కేఎల్ రాహుల్ (29), హర్షిత్ రాణా (29), రోహిత్ శర్మ (26) రాణించారు. దీంతో భారత్‌కు గెలుపు ఈజీ అయింది.