Sekhar Reddy Sudha
9.3K views
7 days ago
సాయి దివ్య నామం - పరమ పుణ్య ధామం అకార, ఉకార, సంయుక్తం ఓంకారం . అదే చరాచర సృష్ఠిలో నిండివున్నా ప్రణవ నాదం. అదే మన వేదములకు మూలం . మనలో వ్యాపించి ఉన్న దివ్య శక్తిని సద్గురువై తన పలుకుల ద్వారా చర్యల ద్వారా తెలుపకనె తెలిపిన మహా మహిమాన్వితుడు శిరిడిలో వెలసిన సాయి మహారాజు. ఈశ్వరుడై ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించే సాక్షీభూతుడు. ఓం సాయి అంటే మనలో ఆ ఓంకార శక్తిని ప్రచోదితం చేస్తారు సాయి. శ్రీ అంటే శుభములు, సుఖములు, సంపదలు సంతోషములు మొదలైనవి. శ్రీ సాయి. అంటే మనకు అవసరమైన అన్ని శుభాలనూ అత్యంత ప్రేమ వర్షిస్తారు. సాయి. శ్రీసాయి అనే నామోచ్చారణ సకల పాపహరణం దివ్యమంత్రం. జయ.అంటే జయము. జయ జయ అంటే అఖండమైన విజయం పరంపర, జయ జయ సాయి. అంటే మనకు కావలసిన విజయాలన్నింటినీ ప్రసాదిస్తారు సాయితండ్రీ. త్రికరణ శుద్ధితో ఈ మూడింటినీ కలిపి ఓంసాయి, శ్రీసాయి, జయజయ సాయి' అని అఖండ స్మరణ లేదా భజన చేసే వారికి ఐహికంగా కావలసినవన్నీ ఇవ్వడమే కాకుండా జన్మ కర్మ బంధాలనుండి కూడా తప్పించే బాధ్యత స్వీకరిస్తారు సాయి. త్రికరణ శుద్ధితో చేసే నామజపం ఎంతోశక్తివంతమైనది సాయినామంఎక్కడ అఖండంగా సాగుతుందో ఆ ప్రదేశం అంతా పరమ పవిత్రమౌతుంది. అక్కడకు సాయినాథుడు వేంచేసి ఉంటారు. తమ దివ్యానుగ్రహ ఫలాలనందించి మానవ జన్మకు ధన్యతచేకూరుస్తారు. కాబట్టి ఆ సాయి అఖండ నామ స్మరణం చేద్దాం, ముక్తిని పొందుదామo. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా