ప్రభుత్వం నుంచి తీసుకునే వేలాది రూపాయల వేతనాలు చాలక మామూళ్ళ మత్తులో జోగాడుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు!
లేదా
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యాతాయుతమైన వృత్తికి మచ్చ తెచ్చేలా నానా గడ్డి మేస్తుండటం అత్యంత జూగుస్సకరం,హేయం!
ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బరి తెగించి ప్రజల నుండి ప్రభుత్వం ద్వారా తీసుకునే వేలాది రూపాయల వేతనాలు చాలక,మరీ కకృతికి, అత్యాశకు పోయి మామూళ్ళ మత్తులో జోగాడుతున్న వైనం ఈ సమాజానికి సంబంధించి అత్యంత సిగ్గుచేటైనా,జుగుస్సకరమైన విషయం.ఓక విధంగా చెప్పాలంటే వీరి వ్యవహారశైలిని చూస్తే అత్యంత బాధ్యాతాయుతమైన,గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ కూడా వారి పవిత్ర వృత్తికి మచ్చ తెచ్చేలా,కళంకం వచ్చేలా ఇలా నానా గడ్డి మేస్తుండటం ఏ మేరకు,ఎంతమేరకు సబబో ఒక్కసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే బాగుంటుంది.అయితే ఇలాంటి మితిమీరిన లంచగొండ్ల వంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు వున్న నేటి సమాజంలో కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ,తమ వృత్తిని దైవప్రదంగా భావిస్తూ,నీతి, నిజాయితీ,నిబద్దతతో నడుచుకునే,మసలుకొనే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కోదువలేదు.ఎందుకంటే తమ వృత్తిని అత్యంత అంకితభావంతో చేస్తూ లంచాలకు తావు లేకుండా కాస్తంత సేవాభావంతో తమ విధిని నిర్వర్తించే అధికారులు సైతం ఈ సమాజంలో మనకు తరచుగా తటస్థపడుతుండటం నిజంగా ఓక మంచి ఆరోగ్యకరమైన పరిణామమే.ఇంకా చెప్పుకుంటూ పోతే అదృష్టవశాత్తు ఆ దేవ దేవుడు ప్రసాదించిన మంచి తెలివితేటల ద్వారా ఓక స్ఫూర్తిదాయకమైన విద్యను అభ్యసించి మరీ ఓక గొప్ప హుందాతనంతో కూడిన ఓక చెప్పుకోదగ్గ, ఆర్థికంగా ఎలాంటి డోకా లేని ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడినప్పటికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకనో వక్రమార్గాన వెళుతూ అయిన దానికి కానిదానికి ప్రజలను పీడించుకు తింటూ వారి నుంచి బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తూ శవాలను ఆరగించే,పీక్కుతినే ఓక రాబందుల లాగా వ్యవహారిస్తుండటం వారి పేరాశకు,విపరీత బుద్ధికి ఓ ప్రబల నిదర్శనం.ఓక విధంగా చెప్పాలంటే ' కంచె చేను మెస్తే ' లాంటి వ్యవహారశైలి వున్న ఇలాంటి నీచ,కాసులకు కకృతి పడే బుద్ది గల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మూలాన మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే అప్రతిష్టపాలు అయ్యే దురదృష్టకరమైన పరిస్థితి దాపురిస్తుండటం ఎంతైనా మనమంతా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
ఏదిఎమైన కొన్ని కొన్ని సందర్భాలలో లంచాలు రుచి మరిగిన కొంతమంది ప్రభుత్వ అధికారులు తాము చేసిన తప్పుల మూలాన చట్టం ముందు దోషిగా నిలబడుతూ జైలు ఊచలు లెక్కబెడుతూ, సస్పెండ్ ల వేటు ఎదుర్కొంటున్నప్పటికి కనీసం అలాంటి గుణపాఠం పొందిన వారిని చూసైనా చాలా మంది ప్రభుత్వ అధికారులకు,ఉద్యోగులకు బుద్ది రావడం లేదు,మంచిగా తమ పనేదో తాము చేసుకుంటూ,న్యాయబద్దంగా తమ విధులను నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు అయిన వారిని తమ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తూ కళ్ళు వున్న కళ్ళు లేని కాబోదుల్లా వ్యవహారిస్తూ ఏ మాత్రం తమ చెడు,వినాశక పంథాను మార్చుకోకుండా వక్ర మార్గంలోనే వెళ్తున్న ఆ ప్రభుత్వ అధికారులు సత్ బుద్దిని పొందలేకపోతుండటం అనేది నిజంగా వారు చేజేతులారా కొని తెచ్చుకునే కర్మ క్రిందకు వస్తుంది తప్ప మరేమి కాదు.అయితే ఈ రోజుకు కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు తమ వృత్తికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేస్తూ,వన్నె తెస్తూ మన భారతదేశ కీర్తిని ఇనుమడింపచేసేలా వ్యవహరించేవారు సైతం లేకపోలేదు.ఏమైనా ఇప్పటికయినా మామూళ్లకు,లంచాలకు పాల్పడుతూ తమ బొక్కసాలు నింపుకునే బొత్తిగా వ్యక్తిత్వం లేని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన విధానంలో,తీరు తెన్నులలో కొద్దో గొప్పో మార్పు తీసుకురావాలని మనం ఆశించడంలో తప్పు లేదు.కాబట్టి ఇకనైనా కొంతమంది ప్రభుత్వ అధికారులు తమ వికృత బుద్ధికి స్వస్తి పలికి ఉన్నంతలో తృప్తి పడుతూ,లేనిదాని కోసం అర్రులు చాచే నికృష్ట పంథాకు గుడ్ బై చెబితే యావత్ ఈ దేశ,మన రాష్ట్ర ప్రజానీకం ఎంతో హర్షిస్తారు.అప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగుల,అధికారుల కీర్తి దిశ,దశలా ఇనుమడించడం తథ్యం.మామూళ్లకు అలవాటు పడిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మానవత్వం వికసించాలి!వారు చెడు మార్గాన్ని విడనాడి ఒక మంచి ఆదర్శమైన నడవడికతో ముందుకెళ్లి యావత్ ప్రజల మన్ననలు విశేషంగా పొందాలని మనమంతా మనసా,వాచ,కర్మణ కోరుకుందాం! బొలో భారతమాతాకీ జై! మేరా హిందూస్తాన్ మహాన్!జైహింద్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#అవినీతి