Aaryan Rajesh
1.7K views
2 days ago
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 16 - 12 - 2025, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళ పక్షం, *_నేటి విశేషం_* *ధనుస్సంక్రమణం / ధనుర్మాసారంభం* _*తిరుప్పావై – 1వ పాశురము*_ _*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*_ అవతారిక: గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూల మగు కాలము మనకు లభించినదే యని ఆ కాలమును ముందుగా పొగడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగినవా రెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫల మేమో, దానిని పొందించు సాధన మేమో స్మరించుచు ఈ మొదటి పాటలో ఆనందించుచున్నారు. _*1వ పాశురము:-*_ _*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*_ _*నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!*_ _*శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!*_ _*కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*_ _*ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్*_ _*కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్*_ _*నారాయణనే నమక్కే పఱై దరువాన్*_ _*పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్!*_ _*తాత్పర్యము:-*_ ఓహో! ఇది మార్గశిర్షమాసము. వెన్నల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా !ఈ మార్గశీర్షస్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు, ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణనకు ఏవిధమగు ఆపదయు రాకుండ కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడును అందములగు కన్నులతో అలరుచున్న యశోదయొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱతామరల పోలు కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిని దివ్యముఖమండలము కలవాడును, అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్థించని మనకే, మన మపేక్షించు వ్రతసాధనమగు ’పర’ అను వాద్యమును ఈయనున్నాడు. మన మీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు. *_🌷శుభమస్తు🌷_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023