👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
691 views
24 days ago
భగవంతుడు ఎక్కడున్నాడు? ఒక గ్రామంలో ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమెకు భగవంతుడి మీద అపారమైన నమ్మకం. ఒకరోజు ఆమెకు విపరీతమైన ఆకలి వేసింది, ఇంట్లో గింజ కూడా లేదు. ఆమె రోడ్డు మీద కూర్చుని, "భగవంతుడా, నాకు సహాయం చెయ్" అని ప్రార్థించసాగింది. అదే దారిలో వెళ్తున్న ఒక ధనవంతుడైన నాస్తికుడు ఆమెను చూసి హేళన చేయాలనుకున్నాడు. తన నౌకరును పిలిచి, కొన్ని పండ్లు, బియ్యం, పప్పులు ప్యాక్ చేయించి ఆమెకు ఇవ్వమన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు: "ఆమె ఈ వస్తువులు ఎవరు పంపారని అడిగితే... ‘సైతాన్ పంపాడు’ అని చెప్పు" అన్నాడు. నౌకరు వెళ్లి ఆ వస్తువులను ఆమెకు ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని, కళ్ళకు అద్దుకుని తన సంచిలో సర్దుకోసాగింది. ఆమె ఆ వస్తువులు పంపిన వ్యక్తి పేరు అడగకపోవడం చూసి నౌకరు ఆశ్చర్యపోయి.. "అమ్మా! ఇవి ఎవరు పంపారో నీకు అక్కర్లేదా?" అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ ఇలా అంది: "నాయనా! భగవంతుడు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే... ఆయన పని చేయడానికి సైతాన్ కూడా సిద్ధంగా ఉండాల్సిందే! నాకు పంపింది ఆయన అని తెలుసు, మోసుకొచ్చింది ఎవరైతే నాకెందుకు?" మనం పూర్తి నమ్మకంతో ప్రార్థిస్తే, భగవంతుడు ఏ రూపంలోనైనా మనకు సహాయం చేస్తాడు. నమ్మకమే దైవం! #🙆 Feel Good Status #trust