Kondakintali
930 views
1 months ago
#Konda Kintali Stories# #నేటి ప్రేమలు# మినీ హాస్య కథ: “మనం ప్రేమించుకున్నంత ఘాడంగా ఈప్రపంచంలో ఏజంటా లేరు కదా రాధా!”. పార్క్ లో రాధ ప్రక్కన కూర్చొని ఆకాశం వైపు తదేకంగా చూస్తూ లాన్ లోని చేతికందిన గడ్డిపరకలు పీకుతూ ఎమోషనయ్యాడు మధు. “అవును మధు, మొదట్లో తొక్కలోప్రేమని అనుకున్నాగాని, ఈ నాలుగు సంవత్సరాలూ నాచూట్టూ కుక్కలా తోకాడిస్తూ తిరిగితిరిగి చక్కగానీ ప్రేమలో పడేశావు నన్ను. కానీ తరువాత తెలిసింది, నీవు గడ్డిపరకలు పీకడం తప్పా మరేమీ చేత కాదని. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చి ఈ మాట నీతో చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పటికీ చిరకాల స్నేహితుల్లాగేఉండి, కలకాలం విడిపోయి మధుర జ్ఞాపకాల్లో ఉండిపోదాం మధూ". "అదేంటి అలా అంటావ్"! కోపంగా కసురుకొని సడెన్ గా లేచాడు మధు చేతిలోని గడ్డిపరకలు నేలకు విసిరి కొడుతూ. “నేనన్నది, నీవు విన్నది కరక్టే. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లన్నీ ఫెయిలయ్యి, ఇంకా పదకొండు సప్లిమెంటరీలు రాయాల్సుంది నీవు. అవెప్పుడు గట్టెక్కుతాయో, ఉద్యోగం, సద్యోగం సంగతి ఎప్పుడో ఆదేవుడికే ఎఱుక. అలా అని వెనక ఆస్తి పాస్తులు ఏమీ లేవు" మనసులోని మాట నిర్మొహమాటంగా అడిగింది రాధ. మధు ఏదో చెప్పబోయాడు. మధ్యలో ఆపి రాధ " నేను చెప్పింది ముందు వినూ" .. " మావాళ్లు ఒక సంబంధం చూశారు. అబ్బాయి నీఅంత హేండ్సమ్ లేకపోయినా, ఐఏయస్ సెలక్టయ్యాడు. బోలెడు ఆస్థికూడా ఉందట. ఒప్పేసు కున్నా మరి”. కూల్ గాచెప్పింది రాధ. పార్క్ లో బఠాణీలు, చాట్ అమ్మేవాడు వచ్చి "ఏమైనా కావాలా" అని అడిగాడు. "చూడు మధు, నా దృష్టి లో నీకంటే వీడు నయం..ప్రేమ కడుపునింపదు తెలుసుకో" . ఇలా అన్నానని బాధపడకు అంది రాధ. By KondaKintali.