డా.గంగు మన్మధరావు
4.9K views
2 days ago
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ꧁❀❀❀❀━❀🌹🔆🌹❀━❀❀❀꧂ 🔆 *ఓం నమో వేంకటేశాయ.* 🔆 *తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన* ꧁❀❀❀❀━❀🌹🔆🌹❀━❀❀❀꧂ ఆధ్యాత్మిక సంకీర్తన. 3885. 24-1-26 రేకు: 18-6. సంపుటము: 1-112 రాగము: శ్రీరాగం ||పల్లవి|| ఏమి గల దిందు నెంత గాలంబైన పామరపు భోగ మాపదవంటి దరయ ||చరణం|| కొండవంటిది యాస, గోడ వంటిది తగులు బెండువంటిది లోని పెద్దతనము పుండువంటిది మేను, పోలించినను మేడి- పండువంటిది సరసభావ మింతయును ||చరణం|| కంచువంటిది మనసు, కలిమిగల దింతయును మంచువంటిది, రతి భ్రమతవంటిది మించువంటిది రూపు, మేలింతయును ముట్టు- పెంచువంటిది, దీనిప్రియ మేమి బ్రాఁతి ||చరణం|| ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత పాఁకువంటిది కర్మబంధమెల్ల యేఁకటను దిరువేంకటేశుఁ దలచిన కోర్కి కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ ꧁❀❀❀━❀🔆🙏🔆❀━❀❀❀❀꧂ #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🌅శుభోదయం