Panduranga Reddy kappati
1.7K views
14 days ago
_భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త,రచయిత్రి_ *సావిత్రిబాయి పూలే గారి జయంతి మరియు మహిళా విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు👏* ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా వారికి మా గణ నివాళి👏 తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగా రెడ్డి*_ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు