కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు.
కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట.
యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు.
ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు.
శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు. మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు.
ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు.
తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశ్యంతో, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కాబట్టి .. హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది.
అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది.
అందుకే కేదార్ నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని తెలుస్తుంది
#"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status