విష్ణు సహస్రనామం శ్లోకం - 80
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||
అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.
త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
విష్ణు సహస్రనామం శ్లోకం - 79
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||
సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.
హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.
వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనము
#vishnu sahasranamam #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ