#👉నా స్టేటస్✍️ #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
*గురు స్తోత్ర మాలిక*
🙏💐💐💐🕉️💐💐💐🙏
*గురుపౌర్ణమి నాడు మనం గురువులను పూజిస్తాం.*
*మన సంప్రదాయంలో ఆదిగురువు దక్షిణామూర్తి. తరువాతది శ్రీమహావిష్ణుని అవతారాలలో ఒకటైన హయగ్రీవ అవతారం.*
*గురువు విశిష్టతను తెలిపే మంత్రాలెన్నో - లలితా సహస్రనామం, విష్ణుసహస్రనామాల్లో ఉన్నాయి.*
*సహస్రారంపైన అధివసించి ఉన్న గురుమండల రూపిణి శ్రీలలిత అని లలితా సహస్రనామ స్తోత్రం వర్ణిస్తోంది. *'అవ్యాజ కరుణామూర్తి!* *అజ్ఞానధ్వాంత దీపికా'* అనే నామం కూడా అమ్మను జ్ఞానస్వరూపిణిగా నిరూపిస్తోంది.
*“గురుర్గురుతమోధామా' అనే నామంతో విష్ణుసహస్రనామస్తోత్రం శ్రీమహావిష్ణువును సకల దేవతలకు ఆత్మవిద్య బోధించిన గురుస్వరూపంగా శ్లాఘిస్తున్నాయి.*
*కుమారస్వామి, గణపతి, సూర్యుడు, హనుమంతుడు మొదలైన దేవతలంతా గురుస్వరూపాలే. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు 'జగత్తే తనకు గురువు' అని ప్రకటించాడు.*
*ప్రకృతిలో 24 మంది గురువులు ఉన్నారని తెలియచేశాడు. గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు, జగద్గురువు.*
*వేదవిజ్ఞానాన్ని జగత్తుకి పంచిన వ్యాసుని పుట్టినరోజు మనకు గురుపౌర్ణమి. భారతీయ వేదాంతాన్ని శిఖరాయమాన స్థాయికి తీసుకువెళ్లిన ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు నిత్యస్మరణీయులు.*
꧁