Aaryan Rajesh
728 views
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🍁పంచాంగం🍁 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 22 - 01 - 2026, వారం ... బృహస్పతివాసరే ( గురువారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షo, *_నేటి మాట_* *భగవన్నామ స్మరణ* "భగవన్నామము చాలా విశిష్టత గలది"... ఆర్తితో తలచిన వెంటనే ఆదుకోగల మహిమ గలది. ఎంతటి కర్మ ఫలమునైనా సరే కాల్చివేయగల శక్తి గలది. ఇలలో సంసార బంధాల సాగరం నుండి ఒడ్డుకు చేర్చగల నావ వంటిది. స్మరించినవాడు ఎంతటి పాపి అయినా సరే పావనం చేయగల మహత్యం గలది. కుల, మత లింగ బేధాలు, కాల నియమాలు, వయసు తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా సరే స్మరించుకోగల అతి అనువైన, సులువైన సాధనా మార్గం, ఇట్టి మార్గాన్ని మనం విస్మరించకూడదు. చేద్దాం! ప్రతి దినమూ క్రమము తప్పక నామ స్మరణ చేద్దాం. సాయి గాయత్రి & వేద గాయత్రి జపము చేద్దాము ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయక శ్రీ సత్యసాయి నాథుణ్ణి స్మరించుకుందాం. "నామిని చేరుకోవాలంటే నామ స్మరణ కంటే సులువైన మార్గం మరొకటి లేదు." *_🍁శుభమస్తు🍁_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023